జాతీయ రహదారి 65, ఆరు లైన్ల సమస్యను పరిష్కరించండి

–   కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వినతి
న్యూఢిల్లీ : జాతీయ రహదారి 65, ఆరు లైన్ల సమస్యను పరిష్కరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని వెంకట్‌ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి 65, ఆరు లైన్ల సమస్య, రెజినల్‌ రింగ్‌ రోడ్‌ కు సంబంధించి భూమి లాక్‌ చేయబడిన భాగాన్ని మినహాయించాలని అభ్యర్థించారు.