జీబ్రానిక్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌

చెన్నై : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల సంస్థ జీబ్రానిక్స్‌ తమ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ను తీసుకొచ్చింది. జీబ్రానిక్స్‌- పిక్సాప్లే 18ను ఆవిష్కరించింది. ఇంటిలో ఒక థియేటర్‌ అనుభవాన్ని ఈ కొత్త ప్రొజెక్టర్‌ కలిగి స్తుంది. ఇందులో శక్తిమంత మైన, చక్కని అనుభవా న్ని ఇచ్చే స్పీకర్లు కూడా ఉన్నాయి. 508 సెంటీ మీటర్ల భారీ సైజు కలిగి ఉన్న ఈ ప్రొజెక్టర్‌ లో పలు స్మార్ట్‌ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో ఒక పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌ను అది కలిగి ఉంటుంది. ఆవిష్కరణ కార్యక్రమంలో సహ వ్యవ స్థాపకులు, డైరెక్టర్‌ ప్రదీప్‌ జోషి పాల్గొని మాట్లా డారు. ఈ ప్రొజెక్టర్‌ ధర రూ. 21,999గా ఉన్నది. ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి రానున్నది.