ట్రాక్టర్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి

– మృతునికి కుటుంబానికి రూ.50 లక్షలు,
– గాయపడ్డ వారికి రూ.25 లక్షల
– చొప్పున పరిహారం ఇవ్వాలి
– మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
– ప్రమాదానికి కారణమైన వారిపైన కేసులు పెట్టాలి:
– దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా
నవతెలంగాణ-యాచారం
బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రలో మంగళవారం రాంత్రి మల్లయ్యగూడలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం యాచారం మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన నర్రే జంగయ్య (85) కుటుంబాన్ని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబంతో కలిసి గున్‌ గల్‌ గేటు పైన ప్రమాద బాధితులకు స్థానిక ఎమ్మెల్యే మృతుని కుటుంబానికిి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పన పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంటి ప్రగతి నివేదన యాత్రలో గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి విజయ మోహన్‌ రెడ్డి, ఇటుక లక్ష్మమ్మ, నర్రె భారతమ్మ, అచ్చన మల్లమ్మ, వరికుప్పల నరసమ్మ, ఇటుక బౌరమ్మ, బీరయ్య, రాములమ్మ, రాజశేఖర్‌ రెడ్డి లు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ప్రగతి నివేదన యాత్ర నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యే తనయుడు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా యాత్రలో నిమగమయ్యారని విమర్శించారు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా మాట్లాడుతూ ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌, బంటి పైన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులను పరామర్శించక పోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే బాధిత వహించి ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు చిలుక మధుసూదన్‌ రెడ్డి, మస్కు నరసింహ, తాండ్ర రవీందర్‌, రామకృష్ణ, బుచ్చిరెడ్డి, వరికుప్పల సుధాకర్‌, ముచ్చర్ల సంపత్‌, మోటే శ్రీశైలం, నడికుడి కృష్ణ, విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.