డబ్ల్యూపీఎల్‌ మొదలైంది

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) శనివారం ఘనంగా మొదలైంది. ముంబయిలో జరిగిన ఆరంభ వేడుకల్లో ఐదు జట్ల కెప్టెన్లు, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ఆరంభ వేడుకల్లో నృత్య ప్రదర్శనలు అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నాయి.