డయల్ 100 ను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు

నవతెలంగాణ-నిజాంసాగర్ 
డయల్ 100 కు ఫోన్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన టెక్కలి నాగరాజు (33) సోమవారం రాత్రి మద్యం త్రాగి అనవసరంగా డయాల్ 100 కు ఫోన్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగ పరిచినందుకు అతనిపై  కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మళ్ళీ సేవలను దుర్వినియోగం చేయకుండా మహమ్మద్ నగర్ మండల తహసీల్దార్ యెదుట హాజరు పరచి సేవలను దుర్వినియోగం చేయకుండా 1లక్ష రూపాయల పూచీకత్తు చెల్లించే విధంగా బైండోవర్ చేయడం జరిగింది అని ఆయన అన్నారు. డయల్ 100 ను ఎవరు దుర్వినియోగం చేయకుండా అత్యవసర సేవలను అందరూ కూడా వినియోగించుకోవాలని ఆయన కోరారు.