డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డికి ఐసీటీ ఫెలోషిప్‌

హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి ప్రతి ష్టాత్మక డాక్టర్‌ అంజిరెడ్డి మెమోరియల్‌ తొలి ఫెలోషిప్‌ దక్కింది. ముంబయిలోని ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ) దీన్ని ఏర్పాటుచేసింది. బయోథెరప్యుటిక్స్‌, భారత ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన పారిశ్రామికవేత్తలకు దీన్ని అందిస్తారు. గోవాలో జరిగిన ఐసిటి నాలుగవ బయోసిమిలర్‌ వర్క్‌షాప్‌లో దీన్ని సతీశ్‌ రెడ్డికి అందజేశారు. డాక్టర్‌ రెడ్డీస్‌ వ్యవస్థాపకుడు కె అంజిరెడ్డి ఐసిటి పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫెలోషిప్‌ ముందుగా సతీష్‌రెడ్డికి అందజేశారు.