డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో సంబురాలు

నవతెలంగాణ-ఓయూ
తార్నాక డివిజన్‌లోని డిప్యూటీ మేయర్‌ క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌ రెడ్డి పదవిని చేపట్టి రెండేండ్లు పూర్తి చేసుకుని మూడో ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా తాము చేపట్టిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఈ సందర్భంగా తార్నాక డివిజన్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షులు మోతె శోభన్‌ రెడ్డితో కలసి శనివారం కేకే కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ రెండ ేండ్ల పదవీ కాలం ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. నగరంలోనే తార్నాక డివిజన్‌ ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్ర గామిగా నిలిపాం అన్నారు. మరో వైపు జీహెచ్‌ఎంసీ నగర అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకంగా ముందుకు వెళుతున్నాం అన్నారు. తార్నాక, లాలాపేట, శాంతినగర్‌, మాణికేశ్వర్‌ నగర్‌ ప్రాంతాల్లో దాదాపుగా రూ.50 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం అని తెలిపారు. రూ.6 కోట్లతో స్విమ్మింగ్‌ ఫూల్‌, రూ.6 కోట్లతో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, రోడ్డు విస్తరణ, లాలాపేట ప్లై ఓవర్‌ సుంద రీకరణ, రోడ్లు, సివరేజ్‌, వైకుంఠ దామాలు అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపట్టాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజా పాషా, యాకోబ్‌ షరీఫ్‌, ఆనంద్‌, కుమార్‌, అలీ, ఫయాజ్‌, నగేష్‌, లక్ష్మారెడ్డి, జహీర్‌, తదితరులు పాల్గొన్నారు.