ఢిల్లీ మద్యం కుంభకోణంలో గౌతమ్‌ మల్హోత్రాకి కస్టడీ

–   14 రోజుల పాటు రిమాండ్‌
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభ కోణంలో మనీ లాండరింగ్‌ కేసుపై రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గౌతమ్‌ మల్హోత్రా కి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మనీ లాండరింగ్‌ కేసులో బుధవారం తో ఈడి కస్టడీ ముగియడంతో గౌతమ్‌ మల్హోత్రాని కోర్టులో హాజరు పర్చారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి మల్హోత్రాని 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్‌ అవెన్యూ కోర్టు, 14 రోజుల కస్టడీ విధించింది. అనంతరం తీహార్‌ జైలుకు గౌతమ్‌ మల్హోత్రాను పోలీసులు తరలించారు. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేశా రు. ఫిబ్రవరి 8న గౌతమ్‌ మల్హోత్రాని ఈడీ అరెస్ట్‌ చేసింది.