బెర్లిన్ : తూర్పు జర్మనీ చిట్టచివరి కమ్యూనిస్టు నేత హన్స్ మొద్రో (95) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారని వామపక్ష పార్లమెంటరీ గ్రూపు తెలియచేసింది. సంస్కరణలవాదీ అయిన మొద్రో బెర్లిన్ గోడ కూలిన వెంటనే తూర్పు జర్మనీ పాలనా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ప్రభుత్వంలోకి చేరాల్సిందిగా ప్రతిపక్ష శక్తులను కూడా ఆహ్వానించారు. ‘జర్మనీ ఐక్యతను సుస్థిరం చేసే ప్రక్రియ మొత్తంగా శాంతియుతంగా సాగడం ప్రధానంగా ఆయన సాధించిన ప్రత్యేక విజయంగా భావించాలి.’ అని వామపక్ష పార్లమెంటరీ గ్రూపు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది. ఆయన రాజకీయ వారసత్వం ఎన్నటికీ నిలిచి వుంటుందని పేర్కొంది. కమ్యూనిస్టు పార్టీ చీఫ్‌గా 16ఏళ్ళు పాటు పనిచేశారు.