తొమ్మిదో రోజు ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర’

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్‌ హమ్మంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మ గుడి ఎదురు నుండి కాకతీయ నగర్‌, మహేంద్ర నగర్‌, ఇంద్ర సింగ్‌ నగర్‌, వాణి నగర్‌, వెంకటేశ్వర నగర్‌, మార్కెట్‌ రోడ్‌ లలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేసిన నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్‌ హాన్మంత్‌ రెడ్డి గడప గడపకు జోడో అభియాన్‌ స్టికర్‌ వేసి, కరపత్రాలను పంచుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ , ద్వంద్వ నీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించి, కాంగ్రెస్‌ పార్టీ ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన అభివద్ధిని తెలియజేశారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్‌ కుమార్‌, ఆల్‌ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజే జేమ్స్‌, ఆనంద్‌ రావు, ఏ బ్లాక్‌ సెక్రెటరీ బాలయ్య, ఎక్స్‌ వర్డ్‌ నంబర్‌ ఎండి జాకీర్‌, జెస్సి పాల్‌, హాఫిజ్‌, ఆగమయ్య, ఈశ్వర్‌, బాలరాజు, సాయి మరియు యువజన నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.