దళితుల అభ్యున్నతే కేసీఆర్‌ లక్ష్యం

–  వీఎస్టీ కార్మిక యూనియన్‌ అధ్యక్షులు వి. శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
. దళితుల అభ్యున్నతే కేసీఆర్‌ లక్ష్యమని రామ్‌నగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌, వీఎస్టీ కార్మిక యూనియన్‌ అధ్యక్షులు వి. శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం రాంనగర్‌ డివిజన్‌ హరినగర్‌కు చెందిన దళిత బందు లబ్దిదారు సాలమ్మకు కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు గాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. దళితబంధు పథకం దళిత కుటుంబాలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సిరిగిరి శ్యాం కుమార్‌, కల్పన, అరుణ్‌, వెంకటేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.