– అదానీ వ్యవహారంపై నిపుణుల కమిటీకి ఓకే
– సుప్రీం సూచనకు ఒప్పుకున్న సర్కార్
– సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన సొలిసిటర్ జనరల్
అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూపుతో పాటు భారత స్టాక్ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపింది. ఇది రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీనిపై విచారణ జరిపించడానికి జేపీసీ వేయాలని డిమాండ్ చేశాయి. మొత్తానికి అదానీ వ్యవహారం మోడీ సర్కారుకుమాయని మచ్చ తెచ్చిపెట్టిందని విశ్లేషకులు తెలిపారు.
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. సుప్రీంకోర్టు సూచన మేరకు మదుపరుల రక్షణ విషయంలో సెబీ యంత్రాంగాన్ని పటిష్టపరిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. అదానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సెబీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటుపై కేంద్రం సమ్మతిని సుప్రీంకోర్టుకు తుషార్ మెహతా తెలిపారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సెబీ సమర్థవంతంగా ఉన్నదని తెలిపారు. కమిటీ నిర్వహణ గురించి చెప్పాలని సుప్రీంకోర్టు తుషార్ మెహతను కోరింది. ప్రతిపాదిత విధి విధానాలపై బుధవారం లోగా నోట్ సమర్పించాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కమిటీపై వివరణనిస్తూ.. కమిటీకి సంబంధించిన పేర్లను త్వరలోనే అందజేస్తామనీ, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ పేర్లను సీల్డు కవర్‌లో అందించనున్నట్టు తుషార్ మెహత చెప్పారు. కమిటీ ఏర్పాటు విషయంలో ఏదైనా సంస్థగా ఉంది. అదానీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీనే 2002లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చుతూ ఆ కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. గుడామి ఇంటర్నేషనల్ కంపెనీలో అదానీకి చెందిన డైరెక్టర్ కీలక వాటాదారులుగా ఉన్నారు. గుడామి ఇంటర్నేషనల్ కంపెనీ నిలిచిపోయిందని, పొరపాటున పేరు ఇచ్చామని 2017లో సింగపూర్ అధికారులు లేఖ ఇచ్చారు. దీంతో ఈడీ తన ఛార్జ్‌షీట్ నుంచి అదానీ సంబంధిత కంపెనీ పేరును తొలగించడం విశేషం. అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కేసులో 2014లో ఈడీ దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో సింగపూర్‌కు చెందిన కంపెనీ పేరు ఉంది. ప్రధాన నిందితుడు గౌతమ్ ఖైతాన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో నకిలీ ఇన్‌వాయిస్‌లను పెంచడం ద్వారా గుడామి వ్యాపారం చేస్తున్నాడని ఛార్జిషీట్ ప్రధానంగా ఆరోపించింది. 2017లో దాఖలు చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లో కూడా గుడామి ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్‌ను ప్రస్తావించింది. మధ్యవర్తి రాజీవ్ సక్సేనాపై దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లోనూ ఆ కంపెనీల గురించి మరోసారి చేర్చింది. ఖైతాన్‌పై 2009లో ఈడీ అధికారులు దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఆ కంపెనీ ఉద్యోగి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షలో గుడామితో సహా డొల్ల కంపెనీల ద్వారా నిధులు పొందిన అనేక కంపెనీల పేర్లను గుర్తించారు. అగస్టావెస్ట్‌ల్యాండ్ స్పా 2.43 కోట్ల యూరోలను ట్యునీషియా ఆధారిత కంపెనీ ఐడీఎస్ టాన్సియాకు బదిలీ చేసింది. ఇందులోంచి 1.24 కోట్ల యూరోలు కైతాన్‌కు చెందిన ఇంటెర్‌స్టెల్లర్ టెక్నలాజీస్‌కు బదిలీ చేయబడ్డాయి. ఇంటర్‌స్టెల్లర్ నగదు తీసుకోవడం, చెల్లింపుల ఆధారంగా చేసుకుని ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చింది.
రెవెన్యూ లక్ష్యాలకు కోత
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రభావం నేపథ్యంలో అదాని గ్రూపు తన రెవెన్యూ వృద్ధి లక్ష్యం అంచనాలకు కోత పెట్టుకుందని సమాచారం. అదేవిధంగా తాజా పెట్టుబడుల వ్యయాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అదానీ గ్రూపు రెవెన్యూ వృద్ధి లక్ష్యాన్ని 15-20 శాతానికి తగ్గించుకుంది. ఇంతక్రితం 40 శాతం వృద్ధి అంచనా వేసింది. మరోవైపు అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగింది. సోమవారం అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ 7.63 శాతం తగ్గి రూ.1,706కు పడిపోయింది. అదాని పవర్ 4.99 శాతం, అదాని విల్మర్ 5 శాతం, అదాని పోర్ట్ 5.39 శాతం, ఎన్‌డీటీవీ 4.98 శాతం చొప్పున నష్టపోయాయి.