కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇంధన్ పల్లి రేంజ్ ఇస్లాంపుర గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్నట్లు ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఇస్లాంపుర గ్రామానికి చెందిన కొందరు ద్విచక్ర వాహనంపై విలువైన టేకు కర్ర తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుకున్న ఆ టేకు కర్ర విలువ 29 134 రూపాయలు ఉంటుందన్నారు. ఆది చక్ర వాహనంతో సహా టేకు కలప ఇంజన్ పెళ్లి రేంజ్కు తరలించినట్లు వారు తెలిపారు. అటవీ అధికారులు పాల్గొన్నారు.