నగలు వేసుకొని విధులకు రావొద్దు

–  హర్యానా వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్‌కోడ్‌
ఛండీగఢ్‌ : హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్‌ కోడ్‌ అమల్లోకి తీసుకొచ్చింది. నూతన నియమావళి ప్రకారం..వైద్య సిబ్బంది ఎవ్వరూ ఇక నుంచి నగలు ధరించి కానీ, ప్రత్యేక మేకప్‌ వేసుకొని విధులకు హాజరు కారాదు. అలాగే ఫంకీ హెయిర్‌స్టైల్‌ చేసుకోరాదు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం కోసమే నూతన డ్రెస్‌కోడ్‌ పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ‘ఆసుపత్రి పనివేళల్లో.. స్కర్టులు ధరించరాదు. అసాధారణ హెయిర్‌ స్టైళ్లతో విధులకు రాకూడదు. టీషర్టులు, జీన్స్‌లు, స్కర్టులు, లెదర్‌ ప్యాంట్లు, క్రాప్‌టాప్‌లను అనుమతించబోం. ఫార్మల్‌ దుస్తులనే ధరించాలి’ అని అనిల్‌ విజ్‌ తెలిపారు.