నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం శాసనసభలో ఆయన పద్దులపై మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు రెట్లు సాగుతో పాటు దిగుబడి పెరిగిందని చెప్పారు.
వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులతో రాష్ట్రంలో నేరాల రేటు తగ్గిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వీలుగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ను అమలు చేస్తామంటూ చెప్పిన ప్రధాని మోడీ ఆ మాటను విస్మరించారని విమర్శించారు. చివరకు సుప్రీంకోర్టు చెప్పినా దాన్ని అమలు చేయలేదని వాపోయారు. మరోవైపు మద్ధతు ధరలను కల్పిస్తామంటూ పార్లమెంటులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.