నిన్నొదలా…

– నిజం బయటకొచ్చే దాకా అదానీని నిలదీస్తాం.. : రాహుల్‌
రాయిపూర్‌.: పార్లమెంట్‌లో పారిశ్రామికవేత్తకు మద్దతుగా బీజేపీ నేతలు వస్తున్నా..నిజం బయటకు వచ్చే దాకా అదానీని వదిలిపెట్టమనీ, అదానీ గ్రూప్స్‌ అక్రమాలపై తాము ప్రశ్నలు అడుగుతూనే ఉంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. అదానీ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రాహుల్‌, అదానీ మొత్తం దేశ సంపదను తాకట్టు పెట్టి దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు.”ప్రధానికీ అదానీకీ బంధం ఏమిటని మేం పార్లమెంటులో అడిగినప్పుడు మా ప్రసంగం మొత్తం కట్‌ చేశారు. అదానీ నిజాలు బయటకు వచ్చే వరకు మేం పార్లమెంటులో వేలసార్లు అడుగుతాం, మేం ఆగం..” అని 85వ ప్లీనరీ సమావేశంలో ఆయన అన్నారు..”అదానీ కంపెనీ దేశాన్ని ముంచేస్తోందనీ, ‘దేశంలోని మొత్తం మౌలిక సదుపాయాలను లాక్కుంటోందని అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఆరోపించారు.”దేశ స్వాతంత్య్రం కోసం యుద్ధం ఒక ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగింది, ఎందుకంటే అది మన సంపదను దోచుకున్నది. అని వివరించారు.అదానీ,బీజేపీ కలయికతో చరిత్ర పునరావతమవుతోందనీ, ఇది దేశానికి వ్యతిరేకమైన పని అని, అలా జరిగితే కాంగ్రెస్‌ పార్టీ మొత్తం వ్యతిరేకిస్తుందని అన్నారు..