నిరుద్యోగ హక్కుల కోసం యువత ఉద్యమించాలి

– అనగంటి వెంకటేష్. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి 
నవతెలంగాణ-గోవిందరావుపేట
నేటి యువత నిరుద్యోగ హక్కుల కొరకు ఉద్యమించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసిన గుడిసేవాసులను సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం పీ ఎస్ఆర్ గార్డెన్ లో డివైఎఫ్ఐ మండల విస్తృతస్థాయి సమావేశం బి సంజీవ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటేష్ హాజరై మాట్లాడారు.
      రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి కేంద్రంలో బీజెపి అధికారంలోకి వచ్చిందని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండానే ఉన్న ఐటీ రంగంలో ఉద్యోగాలను  ఉడదీస్తు నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని ఆయన ప్రభుత్వంపై  మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించక పోగా మతం పేరుతో కులం పేరుతో విడగొడుతూ యువతను చెడు మార్గం పట్టిస్తుందని ఆయన విమర్శించారు దేశంలో యువత హక్కులను సాధించడానికి కులం మతం భేదం లేకుండా ఐక్యం చేసి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని   ఆయన ఈ ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిట్టబోయిన రమేష్, పల్లపు రాజు, జక్కువేను, సాదు శీను, ఉదయ్, జ్యోతి, కారం రజిత, రేణుక, కందుల శ్రావణ్, పి అరుణ్, బత్తుల సాయికుమార్, సాంబ, మణికంఠ, రాజేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.