నిర్ణీత గడువులోగా పనులు

– ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణంలో క్షేత్ర స్థాయిలో పను లను పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్‌, వర్క్‌ ఏజెన్సీలతో సమీక్ష నిర్వ హించారు. అధినేత కె.చంద్ర శేఖర్‌ రావు విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావా లనీ, నిర్మాణ సంస్థ ప్రతి నిధు లను మంత్రి అదేశిం చారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ ముజీబుద్దిన్‌, ఆర్కిటెక్ట్‌ ఆస్కార్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.