నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌

2023- 2025 సంవత్సరాలకు గాను ఆదివారం ఉత్కంఠభరిత వాతావరణంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్మాత జెమిని కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో ఆయన ఈ విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1200 సభ్యులకు గాను 339 మంది సభ్యులు దామోదర ప్రసాద్‌కి వేయగా, 315 ఓట్లను ప్రత్యర్థి జెమినీ కిరణ్‌కు వేశారు. ఉపాధ్యక్ష పదవికి వై.సుప్రియ, కె.అశోక్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, ట్రెజరర్‌గా రామ సత్యనారాయణ గెలుపొందారు. సెక్రటరీలుగా ప్రసన్న కుమార్‌, వై.వి.ఎస్‌.చౌదరి, జాయింట్‌ సెక్రెటరీలుగా భరత్‌ చౌదరి, నట్టికుమార్‌ ఎన్నికయ్యారు. దిల్‌ రాజు, దానయ్య, రవి కిషోర్‌, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్‌, సురేందర్‌ రెడ్డి, గోపీనాథ్‌ ఆచంట, మధుసూదన్‌ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్‌ వజ్జ, అభిషేక్‌ అగర్వాల్‌, కష్ణ తోట, రామకష్ణ గౌడ్‌, కిషోర్‌ పూసలు తదితరులు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఎంపికైన ఈ నూతన కార్యవర్గం 2023- 2025 వరకు కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నూతన అధ్యక్షుడు దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ,’అందరూ ఒకటే అనే నినాదంతో కౌన్సిల్‌ అభివధికి పాటుపడదాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దష్ఠిలో పెట్టుకొని సభ్యుల సంక్షేమం కోసం హౌసింగ్‌, పేద నిర్మాతల పిల్లల విద్య, వివాహం, ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ని కౌన్సిల్‌లో విలీనం చేయడానికి బైలా మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.