– 2,201 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
– 3.55 లక్షల మంది హాజరు
– సర్వం సిద్ధం చేసిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి రెండో తేదీ వరకు ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సర్వంసిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జనరల్ విద్యార్థుల కోసం 1,709, ఒకేషనల్ విద్యార్థుల కోసం 492 కలిపి మొత్తం 2,201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్ విద్యార్థులు 2,62,153 మంది, ఒకేషనల్ విద్యార్థులు 93,298 మంది కలిపి 3,55,451 మంది విద్యార్థులు హాజరవుతారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ్‌రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. వాటిపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ సంవత్సరం కూడా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయలేదు. విద్యార్థులు చదువుతున్న కాలేజీలో ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాటి పర్యవేక్షణ కోసం ప్రభుత్వం డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 040-24600110 నెంబర్‌ను సంప్రదించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ పరీక్షలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.