న్యాయం జరిగేలా చూస్తా

– వరంగల్‌ రైతు గట్ల సురేందర్‌కు బండి సంజరు హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
న్యాయం జరిగేలా చూస్తానని వరంగల్‌ రైతు గట్ల సురేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్‌ హామీనిచ్చారు. అధికార పార్టీ నేతల అండతో తన భూమిని కబ్జా చేసి తనను చంపేందుకు కుట్ర చేస్తున్న తన సోదరుడి బారి నుంచి కాపాడాలంటూ వరంగల్‌ జిల్లా పొనకల్‌కు చెందిన రైతు పొట్ల సురేందర్‌…బండిసంజరును ఆదివారం కలిశారు. ఆయన ఐద్రోజులుగా హైదరాబాద్‌లో నాగలిపట్టిన ఫ్లెక్సీతో అర్ద నగంగా తిరుగుతూ సీఎం, మంత్రులు, డీజీపీని కలిసేందుకు ప్రగతి భవన్‌, డీజీపీ కార్యాలయ ంసహా మంత్రుల చాంబర్లు చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. తన పొలం తనకు ఇవ్వకపోగా, రెండుసార్లు చంపేందుకు యత్నించారనీ, దాడి చేశారని బండి ఎదుట వాపోయారు. పోలీసులను, మంత్రులను ఆశ్రయించి నా న్యాయం జరగలేదన్నారు. ‘బాధపడొద్దు. నీకు అండగా ఉంటా. న్యాయం జరిగేలా కృషిచేస్తా’ అని భరోసా ఇచ్చారు. వెంటనే సదరు రైతు పక్షాన న్యాయ పోరాటం చేయాలంటూ లీగల్‌ టీంకు బాధ్యతలు అప్పగించారు.