పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జన్నారం ఎంపీడీవో శశికళ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ పరిసరాలలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచినట్లయితే ఈగలు దోమలు వాలి డేంగి మరేరియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్న సందర్భంలో కాచి వడపోసిన మంచినీటినే తాగాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.