పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలి

రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
పర్యావరణ పరిరక్షణను బాధ్యత ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య సూచించారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ బృందం సోమవారం ఆర్‌.కృష్ణయ్యను కలిసి సంస్థ రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మనిషి నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ప్రకృతి సహజ స్థితి కోల్పోయి విపత్తులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విపత్తులను నిలువరించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్విరాన్‌ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌ మెంట్‌ కౌన్సిల్‌ గౌరవ అధ్యక్షులు ఉప్పల వెంకటేష్‌ గుప్త, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్‌.సి.హెచ్‌.రంగయ్య, సభ్యులు అవినాష్‌, సీనియర్‌ పాత్రికేయులు లక్ష్మణ్‌, టీవీ నటుడు టి.వి రమణ, తదితరులు పాల్గొన్నారు.