పలు కుటుంబాలకు తమ్మినేని పరామర్శ

నవతెలంగాణ-కొణిజర్ల
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని సిద్దిక్‌ నగర్‌, లాలాపురం గ్రామాల్లో పర్యటించారు. సిద్దిక్‌ నగర్‌ గ్రామానికి చెందిన రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్రమల మాధవరెడ్డి మాతృమూర్తి సావిత్రమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా లాలాపురంలో సీపీఐ(ఎం) సీనియర్‌ జిల్లా నాయకులు సంక్రాంతి మధుసూదన్‌ రావు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలు సుకున్నారు. తమ్మినేని వీరభద్రం వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య వీరభద్రం, పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, నాయకులు చింతనిప్పు చలపతి రావు, సొసైటీ డైరెక్టర్‌ సంక్రాంతి నరసయ్య, దొడ్డపనేని కృష్ణార్జునరావు, సంక్రాంతి నరసయ్య, పగిడిపల్లి కాటయ్య, తదితరులు ఉన్నారు.