పశుమిత్ర నూతన జిల్లా కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-కంటేశ్వర్
జిల్లా పశుమిత్రల జనరల్ బాడీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం నిజామాబాదులో జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హాజరయ్యారు. అనంతరం 21 మంది తోటి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆఫీస్ బేరర్స్ 11 మందితో ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు నూర్జహాన్, జిల్లా అధ్యక్షులు మౌనిక జిల్లా ఉపాధ్యక్షులు వనిత, జ్యోతి, కవిత ప్రధాన కార్యదర్శి లక్ష్మి, కోశాధికారిగా మమత, సహాయ కార్యదర్శులుగా కార్తిక, దీప లక్ష్మీ స్వప్న వీరితోపాటు 10 మంది సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.