పాక్‌లో పడవ బోల్తా

– 10 మంది విద్యార్థులు మృతి
ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుతుంఖ్వా రాష్ట్రంలో ఒక పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది విద్యార్థులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారంతా ఏడు నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్నవారే. రాష్ట్రంలోని కోహట్‌ జిల్లాలోని తాండా డ్యామ్‌ సరస్సులో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. సమీపంలోని మిర్బాష్‌ ఖేల్‌ మదర్సాకు చెందిన విద్యార్థులు విహార యాత్రలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.