పిల్లలకు దుప్పట్లు పంపిణీ

నవతెలంగాణ-అంబర్‌పేట
పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నల్లకుంట డివిజన్‌ కార్పొరేటర్‌ వై.అమృత అన్నారు. గురువారం అంగన్‌వాడీ కేంద్రంలోని పేద పిల్లలకు తిలక్‌నగర్‌ మహిళా మండలి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిలక్‌నగర్‌ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో తిలక్‌నగర్‌ మహిళా మండలి అధ్యక్షులు విజయలక్ష్మి, కార్యదర్శి నిర్మల, ఉపాధ్యక్షులు ఉమారాణి కోశాధికారి వసంత, ఉప కార్యదర్శి వనజ, ప్రతినిధులు ఇందిర, నాగలక్ష్మి, రాజ్యలక్ష్మి, రమ, రత్న, లలిత, శ్యాం కుమారి, పప్పీ పాల్గొన్నారు.