తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని మొదటి రోజు శుక్రవారం పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ) ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ )( సెమిస్టర్ ఎల్ ఎల్ బి )
మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడవ మరియు తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ .టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీ లో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ యం అరుణ అడిషనల్ కంట్రోలర్ డాక్టర్.బి సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వర్సిటీ మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ బిక్నూర్, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజాంబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్, ఎస్ ఆర్ ఎం కె గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2253 మంది విద్యార్థులకు 2140 మంది విద్యార్థులు హాజరయ్యారు. 113 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1739 మంది విద్యార్థులకు1665 మంది విద్యార్థులు హాజరయ్యారు 74 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.