
ఒకటే బడిలో పదవ తరగతి వరకు చదివి, 40 ఏళ్ల తర్వాత , చదువు నేర్పిన గురువులతో కలిసి ఒకే వేదికను పంచుకొని ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించినా పూర్వ విద్యార్థులు. మండలంలోని ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి, చదువు నేర్పిన గురువులకు శాలువాలతో సన్మానించి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత చదువుకున్న రోజుల్లోని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అందరూ ఒకే వేదికపై సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ వెంకటి, డి తిరుపతిరెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్ నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు నా రెడ్డి మోహన్ రెడ్డి, పి లింగమూర్తి, ఎల్ రవి, బిక్షపతి రెడ్డి, ఎస్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ శోభారాణి, కాల హనుమాన్లు, జి వినోద, ఎస్ విజయ, బలరాం తదితరులు పాల్గొన్నారు.