నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి పి నగేష్ తండ్రి పొన్న లక్ష్మయ్యకు సంస్థ ఉద్యోగులు నివాళులు అర్పించారు. నల్లగొండ జిల్లా, కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలోని స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళుర్పించిన వారిలో నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్, జనరల్ మేనేజర్లు వెంకటేష్, లింగారెడ్డి, రఘు, మేనేజర్లు వీరయ్య, గురు, పవన్, ఉపేందర్‌రెడ్డి, ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.