ప్రజలకు అధునాతన వైద్య సేవలు.. అతి తక్కువ ధరలో  అందించడమే

– సిబిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్  వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట  : హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అతి తక్కువ ధరలో అవినాతనమైన వైద్య సేవలు అందించడమే సిబిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం జరిగిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు సంబంధించిన ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి ,రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సిబిఎం హాస్పిటల్ ను ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో హాస్పిటలలో   ఆరోగ్యశ్రీ అందించడం జరుగుతుందని
 సీఎం రిలీఫ్ , ఇన్సూరెన్స్ మొదలైనటువంటి సదుపాయాలు   హాస్పిటలో కల్పించడం జరుగుతుందన్నారు. సిబిఎం మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు పూర్తిస్థాయిలో తక్కువ ధరలో  అందిస్తామన్నారు. కటకం శ్రీనివాస చారి  భాగస్వామ్యంతో ఈ యొక్క హాస్పిటల్ ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో అచ్చంపేట నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు  పాల్గొన్నారు.