ప్రజల మౌలిక వసతులు మెరుగుపరచాలి

– సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
నవతెలంగాణ-దుండిగల్‌
ప్రజల మౌలిక వసతులు మెరుగుపరచాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈ. ఉమ మహేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు అస్తవ్యస్తంగా ఉండటంపై సీపీఐ ఆధ్వర్యంలో నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రధాన రహదారులు మొత్తం ప్రజలు తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే భూగర్భ డ్రయినేజీ వ్యవస్థ కూడా పూర్తిగా అధ్వానంగా ఉందన్నాఉ. ఎస్‌ఎన్డీపీ పనులు పూర్తి అయిన ప్రజా సమస్యలు తీరలేదని, ఇందులో నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి. వంశీకష్ణ నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. అలాగే అక్రమ నిర్మాణాలు, షెడ్లు, కబ్జాలకు మున్సిపల్‌ అధికాలు, రెవెన్యూ అధికారు పూర్తి బాధ్యత వహించాలన్నారు. నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఒక గ్రంథాలయం లేకపోవడం చిగ్గుచేటన్నారు. బస్తీ దవాఖానాలు పూర్తి కాకపోవడం విడ్డురం అని అన్నారు. ఈ నిరసన దీక్ష కేవలం ఆరంభం మాత్రమే మున్ముందు అనేక పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి. వంశీకష్ణకు ప్రజల సమస్యల పై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శివ కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు హరినాథ్‌, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌, సీపీఐ నాయకులు, మాజీ వార్డు మెంబర్‌ డిలేశ్వర్‌ రావు, చెన్నారెడ్డి, రాజయ్య, ఆశి యాదయ్య, కె.మల్లయ్య, ఇమామ్‌, ఖాజార్‌ బారు, నాగేష్‌, తదితరులు పాల్గొన్నారు.