– యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ కె గంగాధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి నాలుగు ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో మూడు రెవెన్యూ శాఖకు, ఒకటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి లు పాల్గొన్నారు.