ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించాలి..

– బీసీ సాధికారిక సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య..
నవతెలంగాణ – వేములవాడ 
ఇంటర్నేషనల్ స్థాయిలో శ్రీలంకలో క్రికెట్ ఆడడానిక ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ప్రోత్సాహం అందించాలని బీసీ సాధికారిక సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య విజ్ఞప్తి చేశారు.శుక్రవారం వేములవాడ పట్టణంలోని బిసి సాధికారక సంఘం కార్యాలయంలో వాగ్దేవి హై స్కూల్ చదువుతున్న బీసీ విద్యార్థులు, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న క్రికెట్ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ వేములవాడ వాగ్దేవి హైస్కూల్ లో చదువుతున్న బీసీ కులానికి చెందిన నేరేళ్ళ శివ, సుధన్వీ, మల్యాల గ్రామము,చందుర్తి మండలం వాణిక, చైతన్య, నాంపల్లి గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయాన్ని సాధించి, ట్రోఫీ సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గురువారం రోజున ర మున్నూరు కాపు సంఘ భవనంలో శాలువాతో సన్మానించి విద్యార్థులను సత్కరించారు. ఈ నెల 28 న ఇంటర్ నేషనల్ స్థాయిలో శ్రీలంకలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని,క్రికెట్ టోర్నమెంట్ కి ఎంపికైన భారత దేశం నుండి జరిగే క్రికెట్ మ్యాచ్ లో మన తెలంగాణలోని మన ప్రాంతం నుండి పాల్గొనడం మనకు గర్వకారణం అని కొండ దేవయ్య, అన్నారు.ఇంటర్ నేషనల్ స్థాయిలో, శ్రీలంకలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని క్రికెట్ మ్యాచ్ ఆడుటకు గాను అయ్యే విమాన ప్రయాణం,వసతి సౌకర్యం బోజన సౌకర్యం తదితర ఖర్చులను స్పోర్ట్స్ అథారిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం భరించాలని లు ప్రభుత్వాన్ని కోరారు.బీసీ విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ,ఆర్థిక స్థోమత బాగలేనందున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించాలన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే విధంగా క్రీడాకారులను తయారు చేసిన వాగ్దేవి పి.టీ.దొబ్బ మహేష్,స్కూల్ కరస్పాండెంట్ గుండెల్లి పర్శరాములు,రామకృష్ణ,శ్రీనివాస చారీ, శ్రీనివాస నాయక్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ సాధికారిక సంఘం కన్వీనర్ పొలాస నరేందర్,మారం కుమార్, మైలారం రాముతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.