ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు పట్టాలివ్వాలి..

నవతెలంగాణ-గోవిందరావుపేట
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ యం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలం లోని పసరాలో గుడిసె వాసుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మల వెంకటరెడ్డి  మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని దీనికి నిదర్శనం 109 సర్వే నెంబర్ అని పేర్కొన్నారు. 109 సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డుల లో ప్రభుత్వ భూమి పేరుతో రికార్డు ఉన్నదని అది కొంత మంది రైతులకు కౌలుకు తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ ఆ భూములు వారాధీనంలో లేవు ఆ భూములు కూడా వారు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు గుడిసెలు వేసుకున్న భూమి కూడా గతంలో ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం జూన్ 2022న పేర్కొన్న, రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకోవడంలో విఫలం కావడం జరిగిందని పేర్కొన్నారు. 109 సర్వే నెంబర్లు కొంతమంది భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో సిపిఎం పార్టీ పేదల ను సమీకరించి గుడిసెలు వేసిందని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ రెవెన్యూ అధికారులు ఈ భూమిలో అక్రమ పట్టా ఇచ్చి న కృష్ణారెడ్డికి ఈ భూమి మీద హక్కు ఉన్నాయని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు వెంటనే ప్రభుత్వం అక్రమ పట్టా రద్దు చేయాలని పేదలేసుకున్న గుడిసెలకు పట్టాలి వాళ్ళని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వందనాలు ఎకరాల ప్రభుత్వం మిగులు భూములు ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే గుర్తించి పేదలకు దళితులకు బడుగు బలహీన వర్గాల వారికి పంపిణీ చేయాలని లేనట్లయితే ఆ భూములను తామే గుర్తించి నివాస స్థలాలు లేని పేదలను సమీకరించి గుడిసెలు వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి, సంజీవ, జిట్టబోయిన రమేష్, శారద, సువర్ణ రాజేశ్వరి, సరిత ,సోహెల్, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.