ప్రమోద్ కుమార్ ఇంటికి విచ్చేసిన మంత్రి… కుటుంబ సభ్యులకు పరామర్శ..

– కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా
నవతెలంగాణ – భువనగిరి
అనారోగ్యంతో ప్రమోద్ కుమార్  సతీమణి రోజా  మృతి చెందడం కుటుంబానికి తీరని లోటు అని వారి అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వెలిబుస్తున్నామని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబం అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు  మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి  పోత్నక్ ప్రమోద్ ను పరమర్శించారు. భువనగిరి పర్యటనకు విచ్చేసి ఇటీవల సతీ వియోగం పొందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్  ఇంటికి విచ్చేసి రోజా చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  అన్నివేళలా కుటుంబానికి కష్టనష్టాలు తోడుంటానని అన్నారు కుటుంబ సభ్యులను అడిగే వారి సాధకబాధకాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తీ, మాజీ మున్సిపల్ చైర్మన్లు బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎండి మజర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, వివిధ సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య పాల్గొన్నారు.