ప్రేక్షకుల్ని మెప్పించే మెకానిక్‌

మణి సాయి తేజ టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తున్న చిత్రం ‘మెకానిక్‌’. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి తమ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేేసిన దిల్‌ రాజుకు దర్శక, నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. టేనా శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై మున్నా (ఎమ్‌.నాగ మునెJయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్‌ – నందిపాటి శ్రీధర్‌ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రమిది. ‘ట్రబుల్‌ షఉటర్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంప్లీట్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్‌ ప్రాబ్లెం నేపథ్యంతో, వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. మణి సాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది.