నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ మండలంలోని కంచర్ల, కాచాపూర్, ఇసన్నపల్లి గ్రామాలలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు నివారణ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైలేరియా వ్యాధి నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనె ఉద్దేశంతో ఫైలేరియా వ్యాధి నివారణ కోసం వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కాచాపూర్ గ్రామ సర్పంచ్ బైండ్ల సులోచన సుదర్శన్, కంచర్ల గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి, ఇసన్నపల్లి గ్రామ సర్పంచ్ రాములు, ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులు బాలరాజు, ప్రశాంత్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.