‘బలగం’ బాగుందని ప్రశంసిస్తున్నారు : దిల్‌రాజు

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన తారాగణంగా నటించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దిల్‌ రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ,’సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని అన్నారు. విమర్శకులు కూడా పాజిటివ్‌గా స్పందించారు. చిన్న సినిమా హిట్‌ అయితే ఆ కిక్కే వేరు. నేను తెలంగాణలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మనుషులు చనిపోయి నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు ఎమోషన్స్‌ ఎలా ఉంటాయనే దాన్ని నేను కూడా దగ్గర నుంచి గమనించాను. మన సంస్కతిలో ఏముందనే విషయాన్ని వేణు పట్టుకున్న తీరు నాకు బాగా నచ్చింది. ఆ సమయంలోనే సినిమా చాలా నేచురల్‌గా ఉండాలని చెప్పాను. ఈ సినిమా చూసిన వారందరూ అవార్డ్‌ వస్తుందని అంటున్నారు. అయితే నేను అవార్డు కోసం సినిమా చేయలేదు. వస్తే మంచిదే. డైరెక్టర్‌ వేణు ఎల్దండి మా బ్యానర్‌లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నాడు. నెక్ట్స్‌ ఓ డాన్స్‌ మాస్టర్‌ను హీరోగా, సింగర్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.