
అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాం పూర్ణచందర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్ష రూపాయల ఎల్ఓసి వై సతీష్ రెడ్డి అందించినట్లు తెలిపారు. శుక్రవారం పూర్ణచందర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పూర్ణచందర్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కిడ్నీ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో పూర్ణచందర్ సోదరుడు సతీష్ రెడ్డిని సంప్రదించగా వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు. పూర్ణచందర్ ఆరోగ్యానికి ఎంత ఖర్చయినా తాను అండగా ఉంటానని ప్రభుత్వం తరఫున సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సతీష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. పూర్ణచందర్ త్వరగా ఆరోగ్యం కోలుకొని పూర్వం మాదిరిగా పార్టీలో చురుకైన పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్లు సతీష్ రెడ్డి అన్నారు. సతీష్ రెడ్డి స్పందించిన తీరు ప్రభుత్వం ద్వారా అందించిన సహాయం మరచిపోలేమని పూర్ణచంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.