బీఎల్‌వీసెట్‌-2023 దరఖాస్తు తేదీ పొడిగింపు:రొనాల్డ్‌ రోస్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఎల్‌వీసెట్‌-2023- దరఖాస్తు స్వీకరించే తేదీ 07.03.2023 నుంచి 13.03.2023 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.2023-24 విద్యా సంవత్సరానికిగానూ గురుకుల సంక్షేమ పాఠశాలల 6, 7,8,9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను 13వ తేదీవరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ww. tsw reis.ac.in వెబ్‌ సైట్‌ను సందర్శించాలనీ,ww. tgtwgurukulam. telangana. gov.in లో ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.