‘బీజేపీ దౌర్జన్యం’

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ రామ్‌నగర్‌ నియోజకవర్గంలోని శిశువిహార్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ బూత్‌లో ఓటు వేశారు. బీజేపీని ఓడించేందుకు ప్రజలు శాయశక్తులా ప్రయత్నించారని ఆయన మీడియాతో అన్నారు. కానీ, బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నిర్భయంగా ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. సబ్‌రూమ్‌లో అభ్యర్థిగా ఉన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి తన నియోజకవర్గ బూత్‌లో ఓటు వేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బీజేపీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఫేస్‌బుక్‌లో సందేశం పంపారు. అగర్తల బోర్దోవాలి అభ్యర్థి ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా తులసిబాటి బాలికల ఉన్నత పాఠశాల బూత్‌లో ఓటు వేశారు.