బీమా పాలసీతో పాన్‌ లింక్‌

–  ముడిపెట్టనున్న ఎల్‌ఐసి
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) తమ పాలసీ దారులకు పాన్‌ కార్డ్‌ అనుసంధా నాన్ని తప్పనిసరి చేయ నున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఐసి పాలసీ కలిగిన వారు వారి పాన్‌ కార్డును 2023 మార్చి 31 లోపు లింక్‌ చేసుకోవాలని ఆసంస్థ సీనియర్‌ అధికారి తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు పొందాలని భావించే వారు కచ్చితంగా పాన్‌ కార్డును సమర్పించాలన్నారు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నారు. పాలసీ కలిగిన వారు కంపెనీ ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో తమ పాన్‌ కార్డ్‌ను లింక్‌ చేసుకోవచ్చన్నారు. అదే విధంగా మొబైల్‌ నెంబర్‌, ఇ మెయిల్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని ఎల్‌ఐసి కోరింది. దీని ద్వారా పాలసీదారులు మరింత సులభంగా సేవలు పొందవచ్చని సూచించింది. ఎల్‌ఐసి దాదాపు 30 కోట్ల పాలసీదారులను కలిగి ఉంది.