బూత్‌ బంగ్లాలో భారీ ఫైట్‌

‘బాహుబలి’ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో ఆర్‌.ఆర్‌.క్రియేషన్స్‌, పాలిక్‌ స్టూడియోస్‌ బేనర్స్‌ పై ప్రొడక్షన్‌ నెం.1గా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పాలిక్‌ ( పాలిక్‌ శ్రీనివాస చారి) దర్శకత్వంలో రమేష్‌ రావుల నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం బూత్‌ బంగ్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆన్‌ లొకేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ‘బాహుబలి’ ప్రభాకర్‌ మాట్లాడుతూ, ‘అద్భుతమైన కథతో దర్శకుడు పాలిక్‌ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా పై ఒక డిఫరెంట్‌ సాంగ్‌ని కూడా పిక్చరైజ్‌ చేశారు’ అని అన్నారు. ‘ఇదొక భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ప్రస్తుతం రవి మాస్టర్‌ సారథ్యంలో ప్రభాకర్‌ పై భారీ ఫైట్‌ని బూత్‌ బంగ్లాలో చిత్రీకరిస్తున్నాం’ అని దర్శకుడు పాలిక్‌ చెప్పారు. నిర్మాత రమేష్‌ రావుల మాట్లాడుతూ, ‘అందర్నీ అలరించే మంచి సినిమా’ అని తెలిపారు.