భారత్‌కు మరో 12 చీతాలు

–  దక్షిణాఫ్రికా నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో రాక
– అటు తర్వాత ఎంపీలోని కునో నేషనల్‌ పార్కుకు
– ఇందులో ఏడు మగ.. ఐదు ఆడ చీతాలు
న్యూఢిల్లీ : భారత్‌కు మరో 12 చీతాలు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో వీటిని తీసుకొచ్చారు.ఇందులో ఏడు మగవి, ఐదు ఆడ చీతాలు  ఉన్నాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు హెలికాప్టర్లలో తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లలోకి ఈ చీతాలను మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌లు వదిలారు. దక్షిణాఫ్రికా నుంచి చీతాలతో వచ్చిన విమానం శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలి యర్‌ ఏయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ల్యాండ్‌ అయింది. అనంతరం అక్కడి నుంచి వాటిని హెలికాప్టర్లలో కునో జాతీయ పార్కుకు తరలించారు. చీతాల రాకపట్ల మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి కృతజ్ఞ తలు చెప్పారు.