భిన్న కథతో అంతిమ తీర్పు

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై సాయి ధన్సిక, అమిత్‌ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఈ చిత్రానికి ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమిత్‌ తివారి మాట్లాడుతూ, ‘ప్రొడ్యూసర్‌కి సినిమా అంటే ఒక మంచి ప్యాషన్‌ ఉంది. ఇలాంటి నిర్మాతలు ఇండిస్టీకి ఎంతో అవసరం. షూటింగ్‌ మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరిగింది. ఇది రెగ్యులర్‌గా ఉండే సినిమా కాదు. ఆద్యంతం ప్రేక్షకుల్ని సీట్‌లో కూర్చోబెట్టే సినిమా’ అని అన్నారు. ‘ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ మంచి క్యారెక్టర్స్‌ చేశారు. ఓ మంచి భిన్న కథతో మీ ముందుకు వస్తున్నాం’ అని నాయిక సాయి ధన్సిక అన్నారు. డైరెక్టర్‌ అభిరాం మాట్లాడుతూ, ‘సినీయర్‌ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పని చేసాను. విలేజ్‌ బ్యాక్‌గ్రాప్‌లో జరిగే ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. కోటి మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. నిర్మాత మంచి సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. విమల రామన్‌, దీపు, సత్య ప్రకాష్‌, గణేష్‌ వెంకట్‌ రామన్‌, చిత్రం శ్రీను, నాగ మహేష్‌, కోటేష్‌ మానవ్‌, మహేంద్రనాథ్‌, ఫణి, వెంకట్‌, ల్యాబ్‌ షార్త్‌, శరత్‌ కళ్యాణ్‌, భవ్య, శీమణి, శిరీష, మురళి బొబ్బిలి, సునీత మనోహర్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డి.ఓ.పి : ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌, పోరాటాలు : డ్రాగన్‌ ప్రకాష్‌-దేవరాజ్‌ నత్యం : ఈశ్వర్‌ పి., ఆర్ట్‌ : వెంకట్‌.