
వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం మిషన్ భగీరథ అధికారులు, ఎంపీఓ శివ చరణ్ తో కలిసి ఏర్గట్ల,తాళ్ళ రాంపూర్ గ్రామాల పరిధిలో గల మంచి నీటి,ట్యాంక్ లను పరిశీలించారు.ఈ వేసవిలో మంచినీటి నీటి ఎద్దడి లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈలు స్వరాజ్, ఉదయ్, పంచాయతీ కార్యదర్శులు జాకీర్, బోజన్న, తదితరులు పాల్గొన్నారు.