మగవాళ్ళ బాధలను చూపించే సినిమా

నరేష్‌ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్‌, మౌర్య సిద్ధవరం, రియా సుమన్‌, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘మెన్‌ టూ’. లాన్‌థ్రెన్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై శ్రీకాంత్‌ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శర్వానంద్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ప్రొడ్యూసర్‌, హీరో మౌర్యకి కంగ్రాజులేషన్స్‌. ‘రణరంగం’ సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ప్రతి స్టెప్‌ నాకు చెప్పేవాడు. తను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ప్రొడక్షన్‌ అని చెప్పా. అతను స్క్రిప్ట్‌ నచ్చి సినిమా చేశాడు. యంగ్‌స్టర్స్‌ కొత్తగా ఇలా చేస్తుంటే బాగా అనిపించింది. మౌర్య తండ్రి కూడా చాలా హెల్ప్‌ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ప్రొడ్యూసర్‌గా కూడా మౌర్య సక్సెస్‌ అయ్యాడని, బిజినెస్‌ బాగా జరిగిందని విన్నా’ అని తెలిపారు. ‘ఏదో ఆడవాళ్లని తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. లేడీస్‌ వల్ల జెంట్స్‌ ఎంత బాధపడుతున్నారు.. వాళ్ల వల్ల వచ్చే సమస్యలను జెన్యూన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. మగవాళ్ల బాధలను చూపించే చిత్రం. జెంట్స్‌కే కాదు.. లేడీస్‌కి కూడా సినిమా నచ్చుతుంది’ అని నటుడు బ్రహ్మాజీ చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్‌ జి.రెడ్డి మాట్లాడుతూ, ”హ్యాష్‌ ట్యాగ్‌ మెన్స్‌ టూ సినిమా స్టోరీతో సినిమా చేయాలనుకుంటే వీడెవరో కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నాడని అందరూ అనుకున్నారు. అయితే మౌర్య నమ్మకంతో ఒప్పుకున్నారు’ అని అన్నారు. ‘యంగ్‌ టీమ్‌తో కలిసి మంచి సినిమా చేశామని అనుకుంటున్నాను’ అని నిర్మాత మౌర్య సిద్ధవరం చెప్పారు.