మనీ లాండరింగ్‌ కేసులో నగల వ్యాపారి

– సుఖేశ్‌ గుప్తాను విచారించిన ఈడీ
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
మనీ లాండరింగ్‌ కేసులో ప్రముఖ నగల వ్యాపారి ఎంబీఎస్‌ జ్యువెల్లర్స్‌ అధినేత సుఖేశ్‌ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎంటీఎస్‌ నుంచి భారీ మొత్తంలో బంగారు నగలను రుణంగా తీసుకొని మోసం చేసినట్టు సుఖేశ్‌ గుప్తాపై నగర సీసీఎస్‌ పోటీసులు కేసును నమోదు చేసి విచారించారు.