మనోధైర్యం ముఖ్యం

– నిమ్స్‌లో క్యాన్సర్‌ డే వాక్‌లో డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్యాన్సర్‌ను జయించేందుకు మనోధైర్యం ముఖ్యమని నిమ్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప తెలిపారు. శనివారం వరల్డ్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా నిమ్స్‌ ఆస్పత్రిలో వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. మెడికల్‌ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ గుండేటి సదాశివుడు మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ , ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు.